సింగరాయకొండలో ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్
ప్రకాశం: సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు మూలగుంటపాడు రోడ్డులో ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దీనిపైకి చెట్టు కొమ్మలు పెరిగాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఎవరైనా పొరపాటున ట్రాన్స్‌ఫార్మర్ తాకితే షాక్ తగిలే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.