ఈనెల 24వ తేదీ నుంచి సైన్స్ ఫెయిర్
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో ఈనెల 24వ తేదీ నుంచి 26 వరకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి మధుకర్ ఓ ప్రకటనలో తెలిపారు. సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనే విద్యార్థుల వివరాలను పాఠశాలలో రిపోర్టు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాల విద్యార్థులు పాల్గొనేల చూడాలన్నారు.