కనకమహాలక్ష్మి ఆలయానికి విరాళం

కనకమహాలక్ష్మి ఆలయానికి విరాళం

విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ అభివృద్ధికి డా. కందుల నాగరాజు, నళిని దేవి దంపతులు రూ.1 లక్ష విరాళాన్ని అందజేశారు. గురువారం ఆలయ ఈవో శోభారాణికి ఈ మొత్తాన్ని అందించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.