అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
RR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అధికారులు గుట్టు రట్టు చేశారు. మంగళపల్లిలోని ఓ రైస్ మిల్లులో జరిపిన తనిఖీల్లో 500 క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది. పేదల నుంచి కిలో రూ.10 నుంచి 12 వరకు సేకరించి, పొరుగు రాష్ట్రాల్లో రూ.20 వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. బియ్యాన్ని సీజ్ చేసి బాధ్యులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.