రేపు పుట్లూరు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

ATP: పుట్లూరు మండలంలో మంగళవారం సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. మండల పరిధిలోని అరటక వేమల గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.