కడప, ప్రొద్దుటూరులో ఎస్సైల బదిలీలు
కడప జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. VRలో ఉన్న B.శ్రీనివాసులును కడప DSBకు, A.అబ్రహంను మహిళ PSకు, JV సుబ్బారాయుడును కడప CCSకు, S.MD షరీఫ్‌ను మహిళా PSకు బదిలీ చేశారు. అలాగే V. శ్రీనివాసులును ఒంటిమిట్ట ఎస్సైగా నియమించారు. ప్రొద్దుటూరు టూ టౌన్‌లో J.ధనుంజయుడును దువ్వురు ఎస్సైగా బదిలీ చేశారు.