మహిళపై దాడి.. ఆభరణాల అపహరణ
ELR: తంగేళ్ళమూడిలోని మహిషాసుర మర్దిని ఆలయం సమీపంలో ఇవాళ ఒంటరిగా ఉన్న 74 ఏళ్ల సామ్రాజ్యంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. దుండగులు ఆమె నుంచి మూడు కాసుల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. తలపై గాయమైన వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. టూ టౌన్ ఎస్సై మధు వెంకటరాజా ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.