పదో అంతస్తు నుంచి పడి బీటెక్ విద్యార్థి మృతి

పదో అంతస్తు నుంచి పడి బీటెక్ విద్యార్థి మృతి

HYD: సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పతరువు రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి పదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి మృతి చెందాడు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.