రాత్రివేళ అందరూ నిద్రిస్తుండగా ఇంట్లోకి చొరబడిన పాము

BHPL: ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఒక్కసారిగా పాము ఇంట్లోకి చొరబడడంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన అంకుషావలి అనే వ్యక్తి ఇంట్లోకి శనివారం రాత్రి 11 గంటలకు నాగుపాము దూరింది. ఉన్నట్టుండిగా ఒక్కసారిగా తమకు మేలుకువ రావడంతో అట్టి పామును చూసి బయటకు వచ్చారు.