రామగుండం బల్దియా ఆద్వర్యంలో పూర్తిగా అక్రమ నిర్మాణాల తొలగింపు

కరీంనగర్: మేడిపల్లి సెంటర్ గ్రీన్ బెల్ట్ ఏరియాలో అక్రమ నిర్మాణాలను రామగుండం బల్దియా ఆధ్వర్యంలో మంగళవారం పూర్తిగా తొలగించారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా ఎన్టీపీసీ వీక్లీ మార్కెట్ లోని ఖాళీ స్థలాన్ని చూపించారు. కూల్చివేత కార్యక్రమాన్ని రామగుండం బల్దియా కమీషనర్ సిహెచ్ శ్రీకాంత్,అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసరావు పర్యవేక్షించగా మేయర్ అనిల్ పరిశీలించారు.