కేసముద్రం రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన
మహబూబాబాద్ జిల్లా కేససముద్రం రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్‌లో రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రయత్నించాడు. వెంటనే ఒక్కసారిగా రైలు కదలడంతో అప్రమత్తమై పట్టాల మధ్య పడుకుని సమయస్పూర్తితో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ సంఘటన చూసిన ప్రయాణికులు షాక్‌కు గురైయ్యారు.