పెన్షన్ల తొలగింపుపై ఎమ్మెల్యే వివరణ

ELR: 2019- 24 వరకు ఎవరైతే వికలాంగులు కాదో వారందరికీ అస్తవ్యస్తంగా పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఈవాళ జిల్లా క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దీని ద్వారా నిజమైన వికలాంగులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సర్వే చేయించగా నియోజకవర్గంలో 757 మంది పెన్షన్లు తొలగించడం జరిగిందన్నారు.