సింహాచలం ఆలయంలో ఫైర్ ఆడిట్
VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం నేపథ్యంలో ఆలయంలో అగ్నిమాపక భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఫైర్ ఆడిట్ నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, పందిళ్లు, విద్యుత్ వ్యవస్థలను పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.