మీ సమస్య మా బాధ్యత కార్యక్రమం
ATP: ధర్మవరం మండలంలోని అప్రా చెరువు గ్రామంలో ఇవాళ టీడీపీ నేతలు 'మీ సమస్య మా బాధ్యత' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ధర్మవరం TDP ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులు అందజేసిన పలు సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు అందజేసిన ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు.