రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తప్పవు: ఎస్సై

MNCL: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తప్పవని జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష సూచించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ పాకిస్తాన్ ,ఇండియా మ్యాచ్ నేపథ్యంలో అందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఎవరిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఆమె కోరారు. ఒకవేళ అలాంటి పోస్టులు పెడితే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు.