'మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'
BPT: కారంచేడులోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇవాళ మాదక ద్రవ్యాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఖాదర్ భాష పాల్గొని విద్యార్థులకు శక్తి యాప్, మాదకద్రవ్యాల గురించి అవగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. డ్రగ్స్ వంటి వలన భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పారు.