ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్
సత్యసాయి: పుట్టపర్తిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో MLA పల్లె సింధూర రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందు స్వీకరించారు. రంజాన్ పండుగ క్రమశిక్షణ, దానగుణానికి ప్రతీక అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు వారు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.