"సమానత్వం కోసం యువత ముందుకు రావాలి"

"సమానత్వం కోసం యువత ముందుకు రావాలి"

KRNL: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతిని ఆదోనిలో AIYF కార్యాలయంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు వారి త్యాగాలు, విప్లవ పోరాటాలు యువతకు మార్గదర్శకమని తెలిపారు. ఈ సందర్భంగా 1931 మార్చి 23న లాహోర్ జైలులో ఉరి తీయబడిన వీరులను స్మరించుకున్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ దేశభక్తి, సమానత్వం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.