సచివాలయ ఉద్యోగులు వాట్సప్ గ్రూపుల నుంచి నిష్క్రమణ
GNTR: దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పొన్నూరు సచివాలయ ఉద్యోగులు పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వార్డు సచివాలయ ఉద్యోగులు మంగళవారం అధికారిక వాట్సప్ గ్రూపుల నుంచి నిష్క్రమించారు. అనంతరం ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబును కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.