పెంచలయ్య హత్య కేసులో కీలక పరిణామం
AP: పెంచలయ్య హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసుకు సంబంధించి నిందితురాలిగా అనుమానిస్తూ అరవ కామాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన తర్వాత కామాక్షి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆమె ఇంట్లో 25 కిలోల గంజాయితో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కామాక్షి నేర చరిత్ర వివరాలను డీఎస్పీ గిరిధర్ వెల్లడించారు.