నరసాపురంలో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం

నరసాపురంలో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం

W.G: నరసాపురంలో రాష్ట్ర నీటిపారుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె తాంబూలాలకు విజయవాడ నుంచి పాలకొల్లు వెళ్తున్న మంత్రి లోకేష్‌కు టీడీపీ నాయకులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇన్‌ఛార్జ్ పోత్తూరి రామరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్‌లో కాన్వాయను ఆపి, పుష్పగుచ్ఛాలు అందించారు.