కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
KMR: కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. గురువారం కౌంటింగ్ కేంద్రంలో అధికారులతో సమావేశం నిర్వహించి, కౌంటింగ్ కోసం సిబ్బంది కేటాయింపులను సమీక్షించారు. కామారెడ్డిలో 114, ఎల్లారెడ్డిలో 42, బాన్సువాడలో 63, బిచ్కుందలో 42 మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటారు.