లోన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య
MDK: లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. 9వ వార్డులో నివాసం ఉండే శ్రీశైలం అనే వ్యక్తి ఇటీవల లోన్ యాప్‌లో డబ్బులు తీసుకొని, అవి కట్టలేక వారి వేధింపులు భరించలేక రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగారు, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందరు. పోలీసులు కేసు నమోదు చేశారు.