బీసీ సంక్షేమ శాఖపై మంత్రి సమీక్ష

బీసీ సంక్షేమ శాఖపై మంత్రి సమీక్ష

ATP: అనంతపురంలోని అతిథి గృహంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారులతో మంత్రి సవిత, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బీసీ సంక్షేమ కార్యక్రమాల అమలు, విద్యార్థుల ఫలితాలు, బీసీ భవనాల నిర్మాణాలపై చర్చించారు. ప్రభుత్వ హాస్టళ్లలో పారిశుద్ధ్యం, మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆదేశించారు. బీసీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.