ఉద్రిక్తత.. బాధితులపై మైనింగ్ మాఫియా దాడి
ASR: రంపచోడవరం నరసాపురం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి మైనింగ్ మాఫియా వీరంగం సృష్టించింది. అక్రమాలపై ఫిర్యాదు చేశారనే కక్షతో బాధితులను పంచాయతీకి పిలిపించి హత్యాయత్నం చేసింది. మద్యం మత్తులో ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడగా, పోడియం అరుణకుమారి తీవ్రంగా గాయపడ్డారు. 100కి కాల్ చేసి పిర్యాదు చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.