పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన వెంకన్న

పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన వెంకన్న

కోనసీమ: అమలాపురం పట్టణంలో పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శనివారం ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వేకువ జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో క్యూలైన్‌లో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.