కార్యకర్తలకు బీజేపీ అండగా ఉంటుంది: ఎంపీ

కార్యకర్తలకు బీజేపీ అండగా ఉంటుంది: ఎంపీ

HYD: పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తగిన సమయంలో ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి, తిరుమల్ రెడ్డిలను ఆయన అభినందించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పని చేయాలన్నారు.