అభివృద్ధి పనులు పర్యవేక్షించిన మేయర్
GNTR: జీఎంసీ పరిధిలో అసంపూర్తిగా నిలిచిన అభివృద్ధి పనులను కాంట్రాక్టర్‌లు పునఃప్రారంభించి వేగవంతం చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆదేశించారు. కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి సోమవారం పట్టాభిపురం ప్రధాన రహదారి, డీఆర్ఎం ఆఫీస్ రోడ్డును మేయర్ పరిశీలించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ విభాగం అధికారులు పర్యవేక్షణ చేస్తుండాలని సూచించారు.