VIDEO: భౌతికాయానికి నివాళులర్పించిన అధికారులు
NLR: మార్కాపురంలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన జయరాములు (55) మృతదేహం బుచ్చిరెడ్డిపాలెం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జయరాములు భౌతికాయానికి ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజ మురళి, టీడీపీ నేత కమలాకర్ రెడ్డి, మండల నాయకులు, అధికారులు నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.