డయేరియా బాధితులకు చికిత్స అందిస్తున్నాం: కలెక్టర్

NTR: విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా వ్యాధికి సంబంధించి ప్రస్తుతం 41 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడటంతో 22 మందిని డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. రాజరాజేశ్వరిపేటతో పాటు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక వార్డులో డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.