గావ్ చలో కార్యక్రమానికి తరలిన బీజేపీ కార్యకర్తలు

జనగామ: స్టేషన్ ఘనాపూర్ మండలం కోమటిగూడెం గ్రామంలో బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నేడు గావ్ ఛలో అభియాన్‌ను కార్యకర్తలు నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర నాయకులు కొలనుపాక శరత్ కుమార్ ఆధ్వర్యంలో కోమటిగూడెం గ్రామంలో పర్యటించి క్షేత్రస్థాయి సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు.