రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
NRPT: కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్‌పీ బంక్ సమీపంలో బైక్ అదుపుతప్పి లారీని ఢీకొనడంతో కర్ణాటకకు చెందిన ఇద్దరు గాయపడ్డారు. వారిని 108లో రిమ్స్‌కు తరలిస్తుండగా కజప్ప (71) మార్గమధ్యలో మృతి చెందాడు. రామయ్య (67) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.