నేడు ఎల్లారెడ్డిలో ఉపాధి హామీ ప్రజావేదిక
KMR: ఎల్లారెడ్డి MPDO కార్యాలయంలో నేడు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు MPDO ప్రకాష్ తెలిపారు. మండలంలోని 31 గ్రామాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై ఈనెల 4వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆడిట్ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికలపై రేపు ఉ10 గం.కు MPDO కార్యాలయంలో ఏర్పాటు చేశారు.