'ఆవాస్ యోజన సర్వేను త్వరగా పూర్తిచేయాలి'
KDP: కొండాపురం ఎంపీడీఓ కార్యాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఎంపీడీఓ నాగప్రసాద్, హౌసింగ్ ఏఈ గురురాజా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లబ్ధిదారులకు అర్హతను బట్టి గృహ నిర్మాణానికి అనుమతులు ఇవ్వనున్నాయన్నారు. PMAY ఆవాస్ యోజన సర్వే ఈ నెల 30లోగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు వారు సూచించారు.