కస్తూర్బా పాఠశాల వద్ద పులి కదలికలు

కస్తూర్బా పాఠశాల వద్ద పులి కదలికలు

KKD: శంఖవరంలో ఒక పాఠశాల వద్ద పులి కదలికలు ఆదివారం కలకలం రేపుతున్నాయి. ఊరకొండపై ఉన్న పులి ఆదివారం కొండ దిగి జనారణ్యంలోకి రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కస్తూర్బా పాఠశాల, కళాశాల సమీపంలోకి పులి వచ్చినట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఏవైపు నుంచి వస్తుందో అని గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.