వార్డు మెంబర్‌గా కూడా గెలవని మాజీ సర్పంచ్
ADB: జైనథ్ మండలం సాంగ్వి (కే) గ్రామంలో విచిత్ర ఘటన జరిగింది. 2019లో BRS తరపున గెలిచిన తీపిరెడ్డి విఠల్.. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ మారి కాంగ్రెస్ తరపున (4వ) వార్డు మెంబర్‌గా పోటీ చేసి గెలవలేకపోయారు. ఆయనపై BRS అభ్యర్థి కంచం సురేష్ 8 ఓట్ల తేడాతో గెలుపొందారు. సర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థి, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవకపోవడం గ్రామంలో చర్చనీయాంశమైంది.