పశు పోషకులకు సూచనలు చేసిన డాక్టర్ మనోహర్

పశు పోషకులకు సూచనలు చేసిన డాక్టర్ మనోహర్

CTR: వేసవిలో పశువుల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పుంగనూరు పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ మనోహర్ పశుపోషకులకు సూచించారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీవాలను ఉ.6-11గం., సా.4-6 గం. మధ్యే మేతకు బయటికి తీసుకెళ్లాలని చెప్పారు. మిగిలిన సమయంలో పాకలో కట్టేసి మేపడం చాలా మంచిదన్నారు. నీరు అన్ని వేళలా పశువులకి అందుబాటులో ఉండేలా చూసుకొవాలని అన్నారు.