ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ప్రత్యేక టీమ్

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ప్రత్యేక టీమ్

CTR: పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని 'నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వీస్' టీమ్ మంగళవారం సందర్శించింది. హాస్పిటల్‌కు వచ్చే ఓపీ, ఇంజక్షన్ రూమ్, మందుల స్టాక్ రూమ్, అలాగే స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్బంగా టీమ్ సభ్యులు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో మరింత శుభ్రత పాటించాలి అని అక్కడి అధికారులకు సూచించారు. వచ్చే రోగులకు కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు.