గుడివాడలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గుడివాడలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గుడివాడ టిడ్‌కో కాలనీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో స్థానిక ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జనరల్ చెకప్, బీపీ, షుగర్ టెస్ట్ లను డాక్టర్లు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ధీరజ్ వినీల్, జనసేన స్పోక్స్ పర్సన్ సందు పవన్ పాల్గొన్నారు.