130 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

130 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

JGL: వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామంలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పి. శ్రీప్రియ ఆధ్వర్యంలో పశు వైద్య సిబ్బంది 58 ఆవులు, ఎడ్లు, 72 గేదెలకు ఉచితంగా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ఛైర్మన్ గొల్ల తిరుపతి, రైతులు కుసనపల్లి లచ్చయ్య, కుసనపల్లి పోషమల్లు పాల్గొన్నారు.