అక్షరాలతో నెహ్రూ జీవిత చరిత్ర చిత్రం అదుర్స్
SRD: భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జీవిత చరిత్రను పేర్కొంటూ అక్షరాలతో ఆయన ఆకారం బొమ్మను రూపొందించిన చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. సిర్గాపూర్ లోని ST బాలికల గురుకులంలోని అధ్యాపకురాలు శ్రావణి, తన భర్త విజయ రాఘవన్ అక్షరాలతో వేసిన చిత్రం అదిరింది. నేడు నెహ్రూ జయంతి, జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా అక్షరాల నెహ్రూ చిత్రంతో శుభాకాంక్షలు తెలిపారు.