టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ

టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ

సత్యసాయి: ధర్మవరం టూ టౌన్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా SP సతీష్ కుమార్ ఇవాళ వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌లోని రికార్డులు, లాకప్ గది, పెండింగ్ కేసులను పరిశీలించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఫ్యాక్షన్ గ్రామాలపై నిఘా, అక్రమ కార్యకలాపాలైన మట్కా, గుట్కా, బెట్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.