'రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలి'

E.G: రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్డు పనుల పై ఆర్ అండ్ బి అధికారులతో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా సీతానగరం రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టి సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.