నూతన రేషన్ కార్డులు.. బియ్యం పంపిణీ..!
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో ఉప్పల్, నాచారం, హబ్సిగూడ సహా అనేక ప్రాంతాల్లో నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన వారికి ఈనెల రేషన్ దుకాణాలలో రేషన్ బియ్యం, సరుకులు పంపిణీ చేస్తున్నట్లు డీలర్లు తెలిపారు. మీసేవ అప్లికేషన్ నంబర్ ఉపయోగించి, నెట్ సెంటర్‌లో మీ దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకోవాలన్నారు.