ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్న గ్రామస్తులు
MNCL:బెల్లంపల్లి మండలం సోమగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన ఇళ్లను హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చేందుకు మంగళవారం అధికారులు JCBలతో చేరుకున్నారు. గమనించిన బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అధికార వర్గాలు, బాధితుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను కోరారు.