గ్యాస్ గోదాంలో అక్రమాలపై తనిఖీలు

గ్యాస్ గోదాంలో అక్రమాలపై తనిఖీలు

WNP: అచ్చంపేటలోని భారత్ గ్యాస్ గోదాంలో తహశీల్దార్ సైదులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. పరిశీలనలో సుమారు 300 గ్యాస్ సిలిండర్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించి, వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదించి బాధ్యులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్ఐ శివ, సిబ్బంది పాల్గొన్నారు.