'ప్రజల సహకారంతోనే పంచాయతీల అభివృద్ధి'

'ప్రజల సహకారంతోనే పంచాయతీల అభివృద్ధి'

SKLM: రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ బోయిన గోవిందరాజులు మంగళవారం కోటబొమ్మాలి పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. ప్రజల సహకారంతోనే పంచాయతీల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రామంలో తాగునీరు, వీధి దీపాలు మరియు పారిశుధ్యం మెరుగుపరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన స్పష్టం చేశారు.