నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
NLR: కందుకూరులో లైన్ వర్క్ పనుల కారణంగా ఆదివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని టౌన్ ఏఈ నరసింహ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తూర్పు వడ్డెపాలెం, మారెమ్మ మిట్ట, తూర్పు కమ్మ పాలెం, తూర్పు సాలెపాలెం, బూడిద పాలెం, రాళ్ళవీధి, ఆదిఆంధ్ర కాలనీల్లో సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.