VIDEO: పులి సంచారం.. అలర్ట్ చేసిన ఎమ్మెల్యే
ASR: రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం పరిసరాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. అటవీశాఖ దీనిని నిర్ధారించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి హెచ్చరించారు. సాయంత్రం 6 దాటాక ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. పులిని బంధించేందుకు శ్రీశైలం నుంచి ప్రత్యేక బృందం రంగంలోకి దిగిందని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.