అర్ధరాత్రి వాహన తనిఖీలు చేసిన డీఎస్పీ

అర్ధరాత్రి వాహన తనిఖీలు చేసిన డీఎస్పీ

NLR: ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై సోమవారం రాత్రి నుంచి అర్థరాత్రి వరకు ఆత్మకూరు డీఎస్పీ కే. వేణుగోపాల్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. సీఐ గంగాధర్, ఎస్సై జిలాని, ఇతర సిబ్బంది పాల్గొని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.